Cyber Crime : సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడిన స్టాఫ్ నర్సు నిరుద్యోగి

by Aamani |
Cyber Crime : సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడిన  స్టాఫ్ నర్సు నిరుద్యోగి
X

దిశ, జనగామ: జనగామ నిరుద్యోగులకు సైబర్ మోసగాళ్లు గాలం వేసిన సంఘటన చోటు చేసుకుంది.ఫిబ్రవరి 2024 లో డీఎంహెచ్ఓ ఆఫీస్ జనగామలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీన్ని అదునుగా తీసుకుని కొందరు సైబర్ మోసగాళ్లు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బాధితులకు ఫోన్ చేసి మీకు స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఫేక్ మెయిల్ ఐడి నుండి ఆర్డర్ కాపీ మెయిల్ చేస్తున్నారు. వాటి ఖర్చుల కోసం అని చెప్పి బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో తేదీ 27 జులై 2024 రోజున ఒక బాధితురాలికి 9831319614 నంబర్ నుండి ఫోన్ చేసి మీరు డీఎంహెచ్వో జనగామ స్టాఫ్ నర్స్ కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకు ఆర్డర్ కాపీ మెయిల్ కి వస్తుంది అని చెప్పి, [email protected] అనే ఫేక్ మెయిల్ నుంచి ఆర్డర్ కాపీ మెయిల్ చేశారు.

రెండు రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని నమ్మ పలికారు. వీటికి కొద్దిగా ఖర్చు అవుతుందని చెప్పి మొత్తం రూ.75 వేలు బాధితురాల నుండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. జూలై 29 2024 రోజున డీఎంహెచ్ఓ ఆఫీస్ లో ఇంటర్వ్యూ ఉందని బాధితురాలు వెళ్లగా ఇది మోసమని తెలిసింది. తర్వాత సదరు విషయాన్ని సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది. దీనిపై జనగామ డీసీపీ ఆదేశాల మేరకు జనగామ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిన లేక మెయిల్ వచ్చిన ప్రజలు నమ్మవద్దు, డబ్బులు కూడా పంపవద్దు. ఒకవేళ దురదృష్టవశాత్తు సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలని తెలిపారు.

Advertisement

Next Story