- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ వర్థంతి సందర్భంగా హన్మకొండలో 2కే రన్
దిశ కేయూ క్యాంపస్ : జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 2 K-రన్ (శాంతిపరుగు)కు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ (ముల్టిపుల్) దాచేపల్లి సీతారాం ముఖ్య అతిదిగా హాజరయ్యారు. జిల్లా వాసవి క్లబ్ రీజియన్ 4-రీజియన్ చైర్మన్ డా.వల్ల్లాల పృథ్వీరాజ్ సారధ్యం లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి కాముక దేశం భారతదేశం అన్నారు. జాతిపిత అవలంభించిన సత్యం, అహింస అనే సిద్ధాంతంతోనే ఏదైనా సాధ్యం అన్నారు. రీజియన్ చైర్మన్ డా.వల్ల్లాల పృథ్వీరాజ్ జెండా ఊపిన అనంతరం, వరంగల్ చౌరస్తా నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు నిర్వహించిన 2 K-రన్ (శాంతిపరుగు) కు మంచి స్పందన లభించింది. 20 మంది మునిసిపల్ కార్మికులకు బ్లాంకెట్ లు పంచారు. ఈ 2 K-రన్ (శాంతిపరుగు) మరియు సేవా కార్యక్రమం లో రీజియన్ లోని వాసవి క్లబ్ వరంగల్, వాసవి క్లబ్ అభ్యుదయ, వాసవి క్లబ్ ప్రతాపరుద్ర, వాసవి క్లబ్ డాక్టర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.