- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రెచ్చిపోయిన పిచ్చి కుక్క..10 మందికి గాయాలు
దిశ, మంగపేట : మండల కేంద్రంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 10 మందిని కరిచి గాయాలు చేసింది. వివరాల్లోకి వెలితే మండల కేంద్రం పద్మశాలివాడలో సంచరించిన పిచ్చి కుక్క ఇంటి పనులు చేసుకుంటూ వాకిట్లో ఉన్న కోడం నరసమ్మ కుడి చేతిని కరిచి కండపీకింది. ఆమె అరవడంతో ఆ పక్కనే ఇంట్లోకి చొరబడి వృద్దురాలు కొండపర్తి ముత్తమ్మ మెడపై కరిచి గాయాలు చేసింది. అక్కడే ఉన్న గ్రామస్తులు కుక్కను తరుముతుంటే పొద్మూరు, ముస్లీంవాడ, మేన్ రోడ్ సెంటర్, గంపోనిగూడెంల మీదుగా పరుగెత్తుతూ కలిసిన వారినల్లా కరిచి గాయాలపాలు చేసింది.
ఆయా కాలనీల్లో సుమారు 10 మందికి పైగా గాయాలు చేయడంతో వెంటపడ్డ గ్రామస్తులు చివరకు కొట్టి చంపి గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు, కోతులు ఉదయం ఇంటి పనులు చేసుకోకుండా మీద పడుతూ గాయాల పాలు చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వితం వ్యాధితో బాధపడుతున్న కుక్కలు, కోతులను పట్టుకుని తరిమేయాలని కోరుతున్నారు. మంగపేట ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు గౌతమ్ తెలిపారు.