CM Revanth Reddy : వరంగల్ దశ - దిశ మార్చేందుకు…నేడు వస్తున్నాను : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddy : వరంగల్ దశ - దిశ మార్చేందుకు…నేడు వస్తున్నాను : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) దశ దిశ మార్చేందుకు నేడు వస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ప్రకటన చేశారు. తెలంగాణ చైతన్యపు రాజధాని..కాళోజీ నుండి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల అని, స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ అని, హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతమని వరంగల్ గడ్డను కొనియాడారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్ అని, వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ దిశ మార్చేందుకు నేడు వస్తున్నానని సీఎం తన పర్యటనను ఉద్ధేశించి ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డి తన వరంగల్ పర్యటనలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణను రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై వరంగల్ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు. రూ.22కోట్లతో చేపట్టనున్న మహిశా శక్తి భవన్ పథకాన్ని వరంగల్ లో ప్రారంభించనున్నారు. రూ.95కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. భూగర్భ డ్రైనేజీకి రూ.4,170కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇన్నర్ రింగు రోడ్డుకు 80కోట్లు, మాస్టర్ ప్లాన్ లో భూసేకరణకు రూ.107కోట్లు, నగర పాలక భవనానికి, 32.50 కోట్లు, భద్రకాళి అమ్మవారి ఆలయ విస్తరణకు 10కోట్లు, మత్తు పదార్ధాల నియంత్రణకు సంబంధించి ఎన్డీపీఎస్ ఠాణాను ప్రారంభిస్తారు. రహదారుల అభివృద్ధికి రూ.338కోట్లు మంజూరు చేశారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగావస్త్ర పరిశ్రమ ముంపు నివారణకు రూ. 160.92కోట్లు మంజూరీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed