- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దిశ’ ఎఫెక్ట్ .. టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదు..వ్యవసాయ అధికారికే ఝలక్ ఇచ్చిన డీలర్
దిశ, వైరా : వరి కోత కోసే చైన్ హార్వెస్టర్లకు టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదు.... ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే చైన్ హార్వెస్టర్లకే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బందిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ నేషనల్ టెస్టింగ్ సెంటర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం... చైనా హార్వెస్టర్లు అమ్ముకోవడానికి టెస్ట్ రిపోర్ట్ తో పని లేదు. ఈ హార్వెస్టర్లను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకోవడానికి మాకు ఇబ్బంది లేదంటూ చైనాకు చెందిన ఓ ట్రాక్ హార్వెస్టర్ కు విజయవాడలో ఉన్న డీలర్ వ్యవసాయ అధికారులకే ఝలక్ ఇచ్చారు. దీంతో వ్యవసాయ అధికారులు అసలు చైనా హార్వెస్టర్ కు ఉండాల్సిన అనుమతులు, విక్రయాలకు సంబంధించిన నిబంధనలపై పూర్తి వివరాలు సేకరించారు. టెస్ట్ రిపోర్ట్ లేకుండా హార్వెస్టర్ విక్రయించ కూడదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దిశ, వెబ్సైట్లో ఆదివారం, దినపత్రికలో మంగళవారం "అంగడిలో పుట్టగొడుగుల్లా చైనా హార్వెస్టర్లు" అనే వార్తా కథనం ప్రచురితమైంది. ఈ వార్త కథనంతో స్పందించిన వ్యవసాయ అధికారులు అనుమతి లేని చైనా హార్వెస్టర్ల పై ఆరా తీస్తున్నారు.
అందులో భాగంగా కల్లూరు మండలం పాయపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తికి హార్వెస్టర్ విక్రయించిన డీలర్ ఎవరు అనే అంశాన్ని ఆరా తీశారు. అనంతరం విజయవాడకు చెందిన ఆ డీలర్ కు వ్యవసాయ అధికారులు ఫోన్ చేసి వివరాలు సేకరించారు. ఆ సమయంలో సదరు డీలర్ మాట్లాడుతూ పొలాల్లో వరి కోత కోసే హార్వెస్టర్లకు టెస్టు రిపోర్ట్ అవసరం లేదంటూ అధికారులకు తెలిపారు. సబ్సిడీ పొందే వాటికి టెస్ట్ రిపోర్ట్ కావాలని అనుమతులకు కొత్త భాష్యం చెప్పారు. వ్యవసాయ అధికారులు సదురు డీలర్ వద్ద ఆ చైనా హార్వెస్టర్ కు సంబంధించిన పత్రాలు ఏమి ఉన్నాయో తమకు పంపాలని సూచించారు. అయితే అధికారుల ఆదేశాలను ఇప్పటివరకు లెక్కచేయకుండా ఎలాంటి పత్రాలను అధికారులకు పంపనట్లు తెలిసింది. అంతేకాకుండా పాయపూర్ కు చెందిన సురేష్ కు ఇన్వాయిస్ రూ. 21 లక్షల బిల్లు ఇచ్చి అతని వద్ద హార్వెస్టర్ కు రూ.23 లక్షలు వసూలు చేశారు.
ఈ విషయమై కూడా అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ హార్వెస్టర్ కొనుగోలు చేసిన వ్యక్తి తన ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన తన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఎలాంటి అనుమతులు లేని హార్వెస్టర్ ను తనకు విక్రయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులు విజయవాడకు చెందిన సదరు చైనా కంపెనీ సేల్స్ రిప్రజెంటేట్ తో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సేల్స్ టాక్స్ అధికారులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం.