- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eatala Rajender: రేవంత్.. అది నిరూపిస్తే రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై: ఈటల
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలన్నింటిని అమలు చేసినట్లుగా నిరుపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) చాలెంజ్ విసిరారు. హామీల చర్చపై సీఎం రేవంత్ (CM Revanth Reddy) సవాలు ను స్వీకరిస్తున్నానని కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు మోడీ (PM Modi) ఎందుకు? అని ప్రశ్నించారు. ఇక్కడ మేము ఉన్నామని నీ ఆరు గ్యారెంటీలే కాదు 420 హామీలపై చర్చను ఆబిడ్స్ చౌరస్తాలో పెడదామ? లేక అసెంబ్లీ, సచివాలయం, ప్రజాభవన్ లో పెడదమా అని నిలదీశారు. మంగళవారం నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై (Congress one year rule) ప్రజలు నవ్వుకుంటున్నారని మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారన్నారు.
ప్రధానిపైనే ఇష్టానుసారమైన వ్యాఖ్యలా?
మహారాష్ట్రలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా ఈటల కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నీ స్థాయి ఎంత? అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఒకలా ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావంటూ ధ్వజమెత్తారు. ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారని ఇకనైనా రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలన్నారు. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటున్న అధికారులు భవిష్యత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతున్నదని సెటైర్ వేశారు.
భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు
ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేస్తే ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారాని ఈటల అన్నారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని భావిస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారని లగచర్ల ఘటనలో స్వయంగా కలెక్టరే నాపై దాడి జరగలేదని చెప్పారన్నారు. ఈ ఘటనలో రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రైతులు నక్సలైట్లు కాదు.. వేరే వాళ్ళ భూములు అడగడం లేదన్నారు.
కమిషన్ లేకుంటే బిల్లులు ఇవ్వడం లేదు:
రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నాడని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదన్నారు. ఓ వైపు మూసీ, హైడ్రా, లగచర్ల వంటి ఘటనలు జరుగుతుంటే ఇంకోవైపు ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.