NTR, Kalyan Ram: అన్న కోసం తమ్ముడు.. ‘అర్జున్ 𝐒/𝐎 వైజయంతి’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2025-04-11 11:18:09.0  )
NTR, Kalyan Ram: అన్న కోసం తమ్ముడు.. ‘అర్జున్ 𝐒/𝐎 వైజయంతి’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటిస్తున్న లేటెస్ట్ హై ఓల్టేజ్ చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun 𝐒/𝐎 Vyjayanthi). యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫ్యామిలీ డ్రామా(Family drama)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. కళ్యాణ్ రామ్ ఆమె కొడుకు పాత్రలో కనిపించనున్నాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై అశోక వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ లాంచ్ అప్‌డేట్ ఇచ్చారు.

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ట్రైలర్ (Trailer) హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12 సాయంత్రం 7:59 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 12న జరగబోతున్నట్లు తెలుపుతూ.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఫైర్‌తో ఒక భారీ సాయంత్రం సెలబ్రేట్ చేసుకుందాం.. ఏప్రిల్ 12న ‘అర్జున్ 𝐒/𝐎 వైజయంతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కలుద్దాం’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ లుక్ నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడంతో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed