చెమటలు ఎక్కువగా పడితే కేలరీలు వేగంగా బర్న్ అవుతున్నట్లా.. ఇందులో వాస్తవమెంత?

by Anjali |   ( Updated:2025-04-11 11:20:19.0  )
చెమటలు ఎక్కువగా పడితే కేలరీలు వేగంగా బర్న్ అవుతున్నట్లా.. ఇందులో వాస్తవమెంత?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది వేగంగా చెమటలు పడితే కేలరీలు తొందరగా బర్న్ అవుతాయని భావిస్తారు. దీంతో అత్యంత వేగంగా వెయిట్ లాస్ అవుతామని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరీ ఇందులో వాస్తవమెంత? నిపుణులు ఏం చెబుతున్నారు. ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.. ఎంత ఎక్కువ చెమట పడితే అంత ఫాస్ట్‌గా బరువు తగ్గుతారని లేదా కేలరీలు బర్న్ అవుతాయని తరచుగా ప్రజలు అనుకుంటారు.

అయితే నిజం కాదని తాజాగా నిపుణులు తేల్చి చెప్పారు. బాడీ ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు ఎక్కువ కేలరీలు కరిగిపోయాయని అర్థం కాదు. అధిక చెమట-కేలరీలు బర్నింగ్ మధ్య ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. నడవడం, బరువులు ఎత్తడం చేస్తున్నట్లైతే మీ కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కేలరీలు ఎంత త్వరగా కరిగిపోయనేది మీ బాడీలోని శక్తి స్థాయి మీద డిపెండ్ అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చెమటలు పడితే ఆరోగ్యానికే మంచిదేనా..?

చెమటలు పట్టడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతుంది. కానీ టాక్సిన్స్‌ను బయటకు తీయడానికి లేదా మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి చాలా చెమట పట్టేలా మిమ్మల్ని బలవంతం చేయడం మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెమటలు పట్టడం సాధారణంగా మంచిదే. కానీ చెమట ద్వారా శరీరం వేడిని కోల్పోయి.. చల్లబరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అధిక చెమటలు పట్టడం అనారోగ్యానికి సంకేతంగా ఉండవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.

చెమట పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు..

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది: చెమట పట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించగలుగుతుంది. వేడిగా ఉన్నప్పుడు శరీరంలో వేడిని తగ్గించడానికి చెమట మేలు చేస్తుంది.

శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది: చెమట ద్వారా శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి.

శరీరాన్ని చల్లబరుస్తుంది: చెమట ఆవిరైపోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.

తలనొప్పి, మైగ్రేన్ నివారణ: చెమటలు పట్టడం వల్ల తలనొప్పి అండ్ మైగ్రేన్ నొప్పులు కూడా తగ్గుతాయి.

అధిక చెమటలు పట్టడానికి కారణాలు:

వేడి వాతావరణంలో లేదా అధిక శ్రమ వల్ల అధికంగా చెమటలు పడుతాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శారీరక వ్యాయామం చేసేటప్పుడు అధికంగా చెమటలు పడుతాయి. అలాగే కొన్ని అంటువ్యాధులు కూడా అధికంగా చెమటలు పట్టడానికి కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. పలు రకాల మందుల కారణంగా కూడా ఎక్కువ చెమటలు పడుతాయి. మీకు అధికంగా చెమటలు పడుతున్నట్లయితే లేదా చెమటలు పట్టడం వల్ల మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.



Next Story

Most Viewed