Warangal Collector : సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కొరకు ఫిర్యాదుల పెట్టె

by Aamani |   ( Updated:2024-08-26 11:27:40.0  )
Warangal  Collector : సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కొరకు ఫిర్యాదుల పెట్టె
X

దిశ, హనుమకొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల లోని విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం 'ఫిర్యాదుల పెట్టె' ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లోని విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. అయితే ఇక పై విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చిన తమ సమస్యలను చీటీ రాసి పెట్టెల్లో వేస్తే, తనిఖీల వేళ కలెక్టర్ స్వయంగా ఫిర్యాదు పెట్టెలను తెరిచి ఫిర్యాదు చీటీలను చూస్తారని పెట్టెలకు సంబంధించిన వాటి తాళాలు కూడా కలెక్టర్ వద్దే ఉంటాయని సమాచారం.

Advertisement

Next Story