'వేతన కమిటీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి'

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-20 08:36:33.0  )
వేతన కమిటీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి
X

దిశ, గోదావరి ఖని: జేబీసీసీఐ వేతన కమిటీ సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ బీఎం ఎస్ రామగుండం ఏరియాII, వకీల్‌పల్లె గని సమావేశంలో అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పాల్గొని మాట్లాడారు. 11వ వేతన ఒప్పందం, 19%శాతం ఎంజీబి, కనీస వేతన పెరుగుదల, మెరుగైన వేతన ఒప్పందం, 19% శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ సాధించడం చారిత్రాత్మకమైన పరిణామన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ జెబీసీసీ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి కృషి ఫలితంగా వీటిని సాధించామన్నారు. ఇది బొగ్గు గని కార్మికుల విజయమన్నారు. కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు తదుపరి సమావేశం ఏర్పాటుకు మొండిగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. బొగ్గు గనులపై సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను చైతన్య పరుస్తున్నామన్నారు. ఫిబ్రవరి 21న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

19శాతం కనీస పెరుగుదల కార్మికులకు క్యాటగిరి-1 బేసిక్ రూ.1011.27 నుండి 1502.67 వేతన పెరుగుదల రూ.6973.73, ఏ 1 కార్మికుడి వేతనం రూ.47,802.53 బేసిక్ నుండి 71030.57 బేసిక్ పెరిగిందన్నారు. కనీస వేతనం పెరుగుదల రు.12,678.69 అయిందని పేర్కొన్నారు. తదుపరి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని పూర్తిస్థాయిలో వేతన ఒప్పందం చేయాలని చూస్తున్న తరుణంలో మొండిగా వ్యవహారిస్తున్న కోలిండియా, సింగరేణి యాజమాన్యాలు దిగివచ్చేలా ఈనెల 21న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బేసిక్‌పై ఆధారపడి పెరిగే అండర్ గ్రౌండ్ అలవెన్సులు, 4%స్పెషల్ అలవెన్స్ హెచ్ఆర్ఏలు పెరగనున్నాయని తెలిపారు. అలవెన్సులు ట్రాన్స్ పోర్ట్ సబ్సిడీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇతర అలవెన్సులు కూడా తదుపరి సమావేశంలో చర్చించనున్నామని తెలిపారు. గత వేతన ఒప్పందంలో మాదిరిగా మెడికల్ స్కీం, పెన్షన్, క్యాడర్ స్కీం, రిటైర్ మెంట్ బెనిఫిట్స్, త్వరలో జరుగు జేబిసిసిఐ సమావేశంలో చర్చించి త్వరలోనే పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.

సింగరేణి వ్యాప్తంగా బలమైన కార్మిక సంఘంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ బలోపేతం అవుతున్నదని పేర్కొన్నారు. జాతీయ భావాలు, క్రమశిక్షణ, దేశభక్తి కలిగి కార్మిక సంఘం సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తుందని తెలిపారు. ఏరియా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు వై. సారంగపాణి, పెండం సత్యనారాయణ, జంగ పల్లి సతీష్, యాదగిరి నరేష్, ముదాం సత్తయ్య, మాదాస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed