- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కార్‌పై అనుమానం.. మళ్లీ సమ్మెకు దిగనున్న వీఆర్ఏలు
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ నిండు సభలో హామీ ఇచ్చి రెండేండ్లు. ఐనా నెరవేర్చకపోవడంతో వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా వీఆర్ఏల జేఏసీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ చర్చలు ఫలించలేదు. మమ్మల్ని నమ్మండి.. సమ్మె విరమించండన్న ఆయన మాటలకు విలువ లేకుండాపోయింది. బుధవారం వీఆర్ఏ జిల్లా జేఏసీల సమావేశం హైదరాబాద్ లో జరిగింది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని తెగేసి చెప్పారు. కనీసం ఎంత కాలంలో ఏయే హామీలను పరిష్కరిస్తారన్న అంశంపై ఇరుపక్షాల అంగీకార పత్రమైనా ఉండాలన్న షరతు విధించారు. కనీసం దసరా పండుగకైనా పే స్కేలు అమలు చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నాండ్లుగా తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తారని ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గురువారం నుంచి తమ సమ్మె యధావిధిగా కొనసాగించాలని రాష్ట్ర జేఏసీ తీర్మానించింది. నేడు మండల తహశీల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు ఉంటాయని జేఏసీ నాయకుడొకరు 'దిశ'కు వివరించారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కమిటీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.