- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ రిజర్వేషన్లు రద్దు సరే.. మీ పాలనలో పదవులన్ని రెడ్లకే ఎందుకో చెప్పు.. రేవంత్ రెడ్డికి విశారధన్ మహారాజ్ ప్రశ్న
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో రిజర్వేషన్లు టాపిక్ భగ్గుమంటోంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి మోడీ, అమిత్ షా వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తారని మోడీ, అమిత్ షా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డా.విశారధన్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది నూటికి నూరు శాతం నిజం. దీనితో మేం ఏకీభవిస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నా రేవంత్ రెడ్డి తన పాలనలో కేవలం 4 శాతం జనాభా ఉన్న రెడ్డిలకు 70 శాతం పైగా పదవులు, అధికారం, సంపద పెంచడం ఏంటని ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ పదవుల పంపంకంపై కేసీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం లేదో తేలాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే సమాజంలో 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలమైన మనం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ లక్ష్యాలేమిటో ఒక నిర్ధారణకు వస్తామని కుల, మత ఆధిపత్యంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు.