- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
phone tapping case: అగ్రనేత కోసం చంచల్ గూడ జైలులో వీఐపీ బ్యారక్ సిద్ధం?
దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ లబ్ధి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో సస్పెండెడ్ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. అయితే వారిని విచారిస్తున్న దర్యాప్తు బృందం మరింత సమాచారం సేకరిస్తున్నది. ఎవరి డైరెక్షన్ లో ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారనే విషయమై అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్‌లో అరెస్ట్ అయిన నిందితులు చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో అగ్రనేత అరెస్టు కాబోతున్నారని, ఈ నేపథ్యంలోనే చంచల్ గూడ జైలులో అగ్రనేత కోసం వీఐపీ బ్యారక్ సిద్ధం అవుతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రచారం జరుగుతోంది. కాగా, దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు జైలులో చిప్పకూడు తినక తప్పదని ఇటీవల గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే.