కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన వికాస్ మంచ్

by Javid Pasha |
కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన వికాస్ మంచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలు రద్దు చేయాలంటూ వికాస్ మంచ్ నేతలు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ ప్రాంతాల విలీనంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు, రక్షణ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Advertisement

Next Story