- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ లీడర్ విజయశాంతి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రయోజనం కోసమే తెలంగాణలో దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని ఇప్పుడు ఆ పథకం డొల్లతనం ఏంటో బట్టబయలైందని విమర్శించారు. శనివారం సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం.. బడ్జెట్‌లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ గత 10 నెలల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదని తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కు ఎదిగిన కేసీఆర్ సర్కార్ సాధించిన ఘనతకు ఇది నిదర్శనం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే సక్రమంగా అమలు చేయని పథకం ఇక దేశం మొత్తం అమలు చేస్తానంటూ డబ్బా కొట్టుకోవడం చూస్తుంటే ఇదంతా దళితులను మోసం చేయడం కాకుంటే ఇంకేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్‌కు పగ్గాలిస్తే దేశం మొత్తం అమలు చేస్తామని దొంగ హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన దళితబంధు, రైతుబంధు చివరకు బంద్ అవుతాయని తాను గతంలో చెప్పానని ఇప్పుడు అదే జరుగుతోందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి : నాకేం కావాలో KTRకి తెలుసు.. పార్టీ మార్పుపై 'దిశ'కు వెల్లడించిన Pongulati Srinivas Reddy