వినాయక మండపాల నిర్వాహకులకు వీహెచ్‌పీ కీలక సూచనలు

by Mahesh |
వినాయక మండపాల నిర్వాహకులకు వీహెచ్‌పీ కీలక సూచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గణేషుడిని ప్రతిష్ట చేసిన రోజే మండపం వద్ద కరెంటు షాకుతో ఓ బాలుడు చనిపోవడం అత్యంత విషాదకరమని విశ్వహిందు పరిషత్ నాయకులు పేర్కొన్నారు. గణేషుడి వద్ద ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విశ్వహిందు పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువకులంతా నిమజ్జనం సందర్భంగా డీజేలతో ఉత్సాహం చూపడం సంతోషకరమేనని అయితే డీజే సౌండ్ వల్ల గుండెకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉందన్నారు. అందువల్ల డీజే సౌండ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నీటిలో లోను దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం వరదలు వస్తున్న సందర్భంగా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. ఈత రాని వాళ్లను చెరువులు, కుంటలు, నదులు, వాగుల దగ్గరకు రానివ్వకుండా నిర్వాహకులు చూసుకోవాలని సూచనలు చేశారు. హిందూ సంఘటన కోసం చేస్తున్న ఈ వేడుకలన్నీ మరింత శోభాయమానంగా విరజిల్లాలని, కానీ ఏ కుటుంబంలో కూడా శోకసంద్రం మిగలడానికి వీళ్లేదనే విషయం దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed