Jani Master: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..అతని భార్య కూడా దాడి చేశారు: బాధితురాలు

by Maddikunta Saikiran |
Jani Master: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..అతని భార్య కూడా దాడి చేశారు: బాధితురాలు
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ కొరియోగ్రాఫర్(Choreographer),నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడు అంటూ మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల మహిళ కొరియోగ్రాఫర్ రాయదుర్గం(Raidurgam) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ ఘటన నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ఈ కేసుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.ముంబై, చెన్నై, హైదరాబాద్‌(Mumbai,Chennai,Hyderabad)లో జరిగిన ఔట్ డోర్ షూటింగ్స్ లలో జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై 376, 506, 323 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అతని భార్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది.జానీ మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అతని కోరిక నెరవేర్చకపోతే బలవంతంగా దాడికి తెగబడేదని ఆమె తెలిపింది.వేధింపులు తట్టుకోలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. కాగా ఈ కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed