Malavika Bansod: చరిత్ర సృష్టించిన మాళవిక బన్సోద్‌ ..చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై విజయం

by Maddikunta Saikiran |
Malavika Bansod: చరిత్ర సృష్టించిన  మాళవిక బన్సోద్‌ ..చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లో  ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై విజయం
X

దిశ, వెబ్‌డెస్క్:చైనా ఓపెన్‌(China Open) బ్యాడ్మింటన్‌ టోర్నీ(Badminton Tourney)లో భారత యువ మహిళా షట్లర్‌ మాళవిక బన్సోద్‌(Malavika Bansod) సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 22 ఏండ్ల మాళవిక.. 26-24, 21-19 తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్‌,ఇండోనేషియా(Indonesia)కు చెందిన గ్రెగోరియా మరిస్కా టుంజంగ్‌(Gregoria Mariska Tunjung)పై విజయం సాధించింది. గ్రెగోరియా మరిస్కా ఇటీవలే ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics) లో కాంస్యం(Bronze medal) సాధించింది.కాగా 46 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో మాళవిక మ్యాచ్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది.ఈ విజయంతో మాళవిక రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.రెండో రౌండ్‌లో ఆమె స్కాట్లాండ్‌(Scotland)కు చెందిన కిర్‌స్టీ గిల్మర్‌(Kirsty Gilmour)తో తలపడనుంది.కాగా రెండేళ్ల క్రితం జరిగిన ఇండియా ఓపెన్‌(India Open)లో 2012 ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌(Saina Nehwal)ను ఓడించి మాళవిక వార్తల్లో నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed