బేతవోలు పెద్ద చెరువులో మొసలి కలకలం

by Kalyani |
బేతవోలు పెద్ద చెరువులో మొసలి కలకలం
X

దిశ, చిలుకూరు: మండలంలోని పోలేనిగూడెం ఎస్కేప్ కెనాల్ నుంచి బేతవోలు పెద్ద చెరువులోకి వచ్చే వాగులో ముసలి తిరుగుతోందని తహసీల్దార్ ధృవ్ కుమార్ గురువారం తెలిపారు. మొసలిని గమనించిన రైతులు విషయాన్ని ఆయనకు తెలపగా మునగాల తహసీల్దార్ తో కలిసి కాలువను పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు విషయాన్ని తెలిపారు. ఆ అధికారులు శుక్రవారం కాలువలో ముసలి ఆనవాళ్లను పరిశీలిస్తారని ధృవ్ కుమార్ తెలిపారు. ఈలోగా ఆ కాలువ పరిసరాల్లోని రైతులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట ఆర్ఐ ఎం.సీతారామచంద్ర రావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed