'శ్వేత విప్లవం 2.0'ను ప్రారంభించిన అమిత్ షా

by M.Rajitha |   ( Updated:2024-09-19 15:58:26.0  )
శ్వేత విప్లవం 2.0ను ప్రారంభించిన అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్ : పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు 'శ్వేత విప్లవం 2.0'(White Revolution 2.0) కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) గురువారం ఆవిష్కరించారు. భారత పాడి పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి, మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అమిత్ షా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా.. దేశంలో ఎక్కువమంది మహిళలు పాడి పరిశ్రమలోనే పని చేస్తున్నారన్న కేంద్ర మంత్రి.. ఒక్క గుజరాత్(Gujarath) లోనే పాడిపరిశ్రమ ద్వారా ఏటా రూ.60 కోట్ల వ్యాపారం జరుగుతోందని అన్నారు. ఈ శ్వేత విప్లవం మహిళా సాధికారతను పెంచడంతోపాటు, పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయ పడుతుందని తెలిపారు. దీంతోపాటు లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పాల వ్యాపారుల కోసం దేశవ్యాప్తంగా రూపే కార్డులను తీసుకు వచ్చామని, అలాగే డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేశామని అన్నారు. శ్వేత విప్లవం 2.0 కార్యక్రమం ద్వారా రాబోయే ఐదేళ్లలో డెయిరీ కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా పాల సేకరణను 50% పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలియ జేశారు. అందుకోసం సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నామని.. దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్(NDDB) నిధులు సమకూరుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed