Big Breaking: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఏటా ప్రజాపాలన దినోత్సవం..!

by Maddikunta Saikiran |
Big Breaking: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఏటా  ప్రజాపాలన దినోత్సవం..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి కలిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం (Telangana PrajaPalana Day)గా' నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే..తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు,పట్టణ,గ్రామీణ స్థానిక సంస్థల్లో జాతీయ జెండా ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇవాళ హైదరాబాద్(Hyderabad) లో సీఎం రేవంత్(CM Revanth) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.కాగా మిగిలిన జిల్లాల్లో జాతీయ జెండాలను ఎగురవేసే వారి వివరాలను జీవోలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా(Amith Sha),గజేంద్ర సింగ్(Gajendra Singh), కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed