Mamata Banerjee: బెంగాల్ జూనియర్ డాక్టర్ కేసులో కీలక పరిణామం..కోల్‌కతా పోలీస్ కమిషనర్ పై వేటు వేసిన సీఎం మమతా బెనర్జీ

by Maddikunta Saikiran |
Mamata Banerjee: బెంగాల్ జూనియర్ డాక్టర్ కేసులో కీలక పరిణామం..కోల్‌కతా పోలీస్ కమిషనర్ పై వేటు వేసిన సీఎం మమతా బెనర్జీ
X

దిశ, వెబ్‌డెస్క్:ఆర్జీ కర్(RG Kar) ఆసుపత్రి టైనీ డాక్టర్ పై జరిగిన లైంగికదాడి ఘటన పట్ల వైద్యులు గత నెల రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి(CM) మమతా బెనర్జీ(Mamata Banerjee) నిన్న ఐదోసారి చర్చలకు ఆహ్వానించారు.మొత్తం 42 మంది డాక్టర్ల బృందం సీఎం మమతా ఇంటికి వెళ్లి చర్చలు జరిపింది. తన నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు వైద్యులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో మమతా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైద్యులతో సమావేశం అనంతరం ఆమె మాట్లాడూతూ..డాక్టర్లతో సమావేశం సానుకూలంగా జరిగిందని, వారు చేసిన చాలా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని సీఎం మమతా సోమవారం రాత్రి ప్రకటించారు. నిరసన తెలుపుతున్న వైద్యుల డిమాండ్ల మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్(Kolkata Police Commissioner) వినీత్ గోయల్(Vineet Goyal), హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ దేబాసిష్ హల్డర్(Debasish Halder) అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ కౌస్తవ్ నాయక్(Kaustav Nayak)లను వారి పోస్టుల నుంచి తొలగిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.మంగళవారం సాయంత్రం వరకు కొత్త పోలీస్ కమిషనర్ ను నియమిస్తామని వెల్లడించారు.వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినందున ఆందోళన విరమించి వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.ఇక ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వైద్యులు మాట్లాడారు.కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను తొలగిస్తానని సీఎం ప్రకటించడం తమ నైతిక విజయమన్నారు. అయితే తమ డిమాండ్లు సాకారమయ్యేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed