- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశే ఫేవరెట్ : డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్
దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను భారత గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్ ఎదుర్కోనున్నాడు. ప్రస్తుతం చెస్ ఒలింపియాడ్‌లో వీరిద్దరూ ఆడుతున్నారు. భారత్ జట్టులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుకేశ్‌పై డింగ్ లిరెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశే ఫేవరెట్ అని చెప్పడం గమనార్హం. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్‌తో ఇంటర్వ్యూలో డింగ్ లిరెన్ మాట్లాడుతూ..‘చెస్ ఒలింపియాడ్‌లో నా ప్రత్యర్థి గుకేశ్ అద్భుతంగా ఆడుతున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో అతనే ఫేవరెట్ కావొచ్చు. నా కంటే ఎక్కువ రేటింగ్‌ను కలిగి ఉన్నాడు. గతేడాది నుంచి నా రేటింగ్ పడిపోయింది. రేటింగ్ వ్యత్యాసాన్ని అధిగమించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా.’ అని చెప్పాడు. కాగా, 18 ఏళ్ల గుకేశ్ ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ నెగ్గడం ద్వారా వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. స్విట్జర్లాండ్స్ వేదికగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 13 వరకు మ్యాచ్ జరగనుంది.
- Tags
- #D Gukesh