VH: సీట్ల కోసం దేశాన్ని ముక్కలు చేయొద్దు: వీహెచ్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-10-07 13:45:51.0  )
VH: సీట్ల కోసం దేశాన్ని ముక్కలు చేయొద్దు: వీహెచ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాలు, విబేధాలు పక్కన పెట్టి సమాజంలో హిందువులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagavath) ఇటీవలే ఓ పబ్లిక్ మీటింగ్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చారు. హిందూ సమాజ పరిరక్షణకు కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటై హిందూ దేశాన్ని స్థాపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఇవాళ ఘాటుగా స్పందించారు.

గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల కోసం దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు బీజేపీ (BJP)తో పాటు అనుబంధ సంఘాలు మానుకోవాలని హితవు పలికారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చేస్తే.. ఇతర మతస్తులు ఎక్కడి వెళతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ‘చార్ సౌ పార్..’ అంటూ హల్‌చల్ చేశారని.. తీరా చూస్తూ 300 సీట్ల కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒక్కటి కూడా అమలు చేయలేదని వీహెచ్ ఆరోపించారు.

Advertisement

Next Story