- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
VH: వీహెచ్ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ.. ముఖ్య అతిథిగా మీరా కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత వీహెచ్ జీవిత చరిత్రపై పుస్తకం విడుదల కానుంది. ఈ కార్యక్రమం ఈ నెల 26 న ఢిల్లీలో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 26న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మీరా కుమార్ హాజరై పుస్తకావిష్కరణ చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మరి కొందరు కాంగ్రెస్ నాయకులను, మిత్రులను వీహెచ్ ఆహ్వానించనున్నట్లు తెలిసింది. కాగా కాంగ్రెస్ పార్టీలో తన 50 ఏళ్ల ప్రస్థానంపై స్వీయ చరిత్రను రాస్తున్నట్లు వీహెచ్ ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. విద్యార్థి, యూత్ కాంగ్రెస్, పీసీసీ అధ్యక్షుడిగా తన అనుభవాలతో పాటు ఎదుర్కొన్న ఆటంకాలను ఈ తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాస్తున్నట్లు చెప్పారు. అంతేగాక ఈ పుస్తకానికి "హనుమంతుడు అందరివాడే" అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.