శ్రీ రాముడు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై

by Mahesh |   ( Updated:2024-01-25 04:24:14.0  )
శ్రీ రాముడు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది: గవర్నర్ తమిళిసై
X

దిశ, వెబ్‌డెస్క్:అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేపు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగిస్తామని తెలిపింది. అలాగే రేపు ఉదయం అందరూ పాల్గొనే పూజను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. హిందువు ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. కాగా ఇటీవల ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆమె ఖైరతాబాద్ లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని తన చేతులతో స్వయంగా శుభ్రం చేశారు.

Advertisement

Next Story