ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్

by Mahesh |
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడుకు చెందిన గుకేష్(Gukesh).. ఇటీవల జరిగిన చెస్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో విజయం సాధించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌(World Chess Champion)గా నిలిచాడు. దీంతో ఆయనకు కేంద్ర, రాష్ట్రాలతో పాటు సెలబ్రేటీలు.. గ్రీటింగ్స్ చెబుతూ బహుమతులు ఇస్తున్నారు. ఈ క్రమంలో తమిళ సీనియర్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth).. ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు ఉహించిని, విలువైన బహుమతి(Gift) ఇచ్చారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన తర్వత తనను కలిసేందుకు వచ్చిన గుకేశ్‌కు యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ(Autobiography of a Yogi) పుస్తకాన్ని(book) రజినీకాంత్ బహుకరించారు. కాగా తాను కలవడానికి సమయం ఇవ్వడంతో పాటు జ్ఞానాన్ని పంచడంపై గుకేష్ హీరో రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

దీనికి సంబంధించి గుకేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఒక యోగి ఆత్మకథ(ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి) ప్రపంచంలోని ఆధ్యాత్మిక పుస్తకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పుస్తకాన్ని పరమహంస యోగానంద 1946లో రచించారు. అదే ఏడాది ఈ పుస్తకం ప్రచురితమైంది. ఈ పుస్తకం విడుదలై ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి ప్రపంచవ్యాప్తంగా 14 భారతీయ భాషలతో పాటు 50కి పైగా భాషల్లో ఇది అనువాదమైంది. భారతదేశంలోని గొప్పయోగుల్లో ఒకరైన పరమహంస యోగానంద ఈ పుస్తకంలో తత్వశాస్త్రం, యోగశాస్త్రం, క్రియాయోగం, ధ్యానం గురించి లోతుగా చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed