Wedding Trends : 2025లో పెళ్లి తంతు..! .. ఈ మార్పులదే కీ రోల్!!

by Javid Pasha |   ( Updated:2024-12-27 15:48:10.0  )
Wedding Trends : 2025లో పెళ్లి తంతు..! .. ఈ మార్పులదే కీ రోల్!!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లిళ్లు ఎలా జరగాలి, ఎంత ఘనంగా జరగాలనేది మన తలరాత లేదా అదృష్టాన్ని బట్టి ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ ఈతరం అలాంటి అపోహలను అస్సలు నమ్మడం లేదు. అదృష్టం సంగతి పక్కన పెడితే.. పెళ్లి అనేది చేసుకోబోయే జంటల ప్లాన్ నుబట్టి, వారి బ్యాంక్ బ్యాలెన్స్‌ను బట్టి, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుందని నమ్ముతోంది. అదే సందర్భంలో సంస్కృతి, సంప్రదాయాలను వ్యతిరేకించకుండా, విస్మరించకుండానే వాటికి ఆధునికతను జోడించి ఉన్నంతలో సంతోషంగా, ఘనంగా జరుపుకోవాలనేది నేటి యువతలో కనిపిస్తున్న కొత్త ధోరణి. కాగా 2025లో ఇది మరింతగా విస్తరించనుందని, కొత్త మార్పులు చోటు చేసుకోవచ్చునని ‘2024 - 25 యాన్యువల్ వెడ్డింగ్ ఇండస్ట్రీ రిపోర్ట్’ పేర్కొంటున్నది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఆభరణాల కొనుగోలుకు ప్రయారిటీ

వివాహ ఖర్చు ఎలా ఉన్నా ఉన్నంతో ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన మాత్రం అందరికీ ఉంటుంది. ముఖ్యంగా భారత దేశంలో ఆభరణాలకు అత్యంత ప్రాముఖ్యత, విలువ ఇస్తారు. వచ్చే సంవత్సరం పెళ్లిళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందట. వెడ్డింగ్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం భారతీయ వెడ్డింగ్ ప్లాన్ ఖర్చు మొత్తం గతం కంటే 37.1% పెరగనుండగా ఇందులో అత్యధికంగా ఆభరణాల కొనుగోలుకే కేటాయించే అవకాశం ఉంది. జువెల్లరీ లేదా డైమండ్స్ హోదా, స్థోమత, అదృష్టం, అందం, ఆకర్షణ వంటి అంశాలతో ముడిపడి ఉంటడమే అందుకు కారణం. ఇక ఖర్చుల వివాహ వేదికల కోసం 22. 9 శాతం, క్యాటరింగ్‌ అండ్ డెకరేషన్ కోసం 20 శాతం ఖర్చు పెరగనుంది.

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌కు డిమాండ్

రాబోయే సంవత్సరం వివాహ ఖర్చులకు సంబంధించి ‘2024 - 25 యాన్యువల్ వెడ్డింగ్ ఇండస్ట్రీ రిపోర్ట్’ సర్వే ప్రకారం.. 45.5% మంది సహజమైన వజ్రాలకంటే కూడా, ల్యాబ్‌లో తయారు చేసిన వ్రజాలను, ఆభరణాలను ఇష్టపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రయోగశాలలో తయారైన వజ్రాలు ఎక్కువగా ఎంగేజ్‌మెంట్ రింగ్స్( engagement rings) రూపంలో ఇప్పటికే లభిస్తున్నాయి. పైగా ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, ఆభరణాలు రసాయనికంగా, భౌతికంగా, ఆప్టికల్‌గా సహజ వజ్రాలకు ఏమాత్రం తీసిపోని కారణంగా 2025లో జంటలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ నాసిరకం అనే అపోహలు పూర్తిగా తొలగనున్నాయి.

సోషల్ మీడియా ప్రభావం

పెళ్లి అనేది ఒకప్పుడు ఇంటి ముందు, పచ్చటి పందిరిలో జరపాలనే ఆలోచన ఉండేది పెద్దలకు. కానీ ప్రస్తుతం అలా ఎవరూ అనుకోవడం లేదు. ఆధునిక హంగులు, ఆర్భాటాలు చాలానే ఉంటున్నాయి. వివాహ వేదికలుగా ఫంక్షన్ హాల్స్, హోటల్స్, డెస్టినేషన్ వివాహాలైతే అందమైన పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటున్నది ఈతరం. ఈ మార్పుల వెనుక సోషల్ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం కూడా కొంత ఉంటుందని నిపుణులు అంటున్నారు. డెకరేషన్స్, క్యాటరింగ్, హాల్స్ వంటి విషయాలపై సోషల్ మీడియాలో వేదికల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రముఖులు, వ్యాపార సంస్థలు ప్రజలను, ముఖ్యంగా యువతరాన్ని ప్రభావితం చేయడం మరింత పెరుగుతుంది. దీంతో 2025లో 16.48% మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉండగా, 31.42 % మంది పెళ్లి డెకరేషన్, వేదికల విషయంలో తమ కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాలకే రాబోయే రోజుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. 13.03% జంటలు తమ స్నేహితుల సలహాలతో పెళ్లికి ఎలా డెకరేట్ చేయాలనే విషయంలో ప్రభావితం అయ్యే చాన్సెస్ ఉంటాయి.

సబంధాలు కలిసేది ఇక్కడే..

ఒకప్పటిలా మరీ సంప్రదాయబద్దమైన పెళ్లి చూపులు ఇప్పుడు లేవు. అలాగే రాబోయే సంవత్సరంలో కూడా అలాగే ఉండనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డేటింగ్ లేదా మ్యాట్రిమోనియల్ యాప్‌ల ద్వారా కూడా సంబంధాలు కుదురుతున్నాయి. అయితే 2025లో ఇది మరింత పెరగడంతో పాటు ఇంకా అదనంగా పలు సోషల్ మీడియా యాప్‌లు సంబంధాలను కలుపుకోవడంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. 30% కపుల్స్ సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు, అలాగే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల ద్వారా కలుసుకోవచ్చు. కాగా 60% మంది ఆఫ్‌లైన్‌, వర్క్ ప్లేస్‌లలో లేదా కుటుంబ సభ్యులు చూసే సంబంధాల వల్ల, బంధువులు, సామాజిక సమావేశాల ద్వారా తమ సంబంధాలను సెట్ చేసుకునే అవకాశం ఉంది.

ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్

2025లో 52% మంది జంటలు తమ వివాహ అలంకరణలో పర్యావరణ స్పృహతో ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి. 49.2% పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచాలనే ఆలోచనను విరమించుకుంటారు. బదులుగా ఇన్విటేషన్‌లను ఫొటో షాప్‌లో డిజైన్ చేసి వాట్సాప్ లేదా వివిధ మెసేంజర్ యాప్‌ల ద్వారా బంధువులు, స్నేహితులకు, ఆత్మీయులకు, పరిచయస్తులకు పంపడం ద్వారా పెళ్లిళ్లకు ఆహ్వానిస్తారు. 40.9% మంది పెళ్లి భోజనాలను పేదలకు, అనాథలకు పంచే అవకాశం ఉంది. 36% మంది తాజా పువ్వులకంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ను పెళ్లి వేడుకల్లో ఉపయోగిస్తారు. 31.8% మంది తమ ఫంక్షన్ల సమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని పరిమితం చేస్తారు.

Read More ...

True love: రోగనిరోధక శక్తిని పెంచుతోన్న నిజమైన ప్రేమ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.?




Advertisement

Next Story

Most Viewed