Venu Swamy : శ్రీతేజ్ కు వేణు స్వామి రూ.2లక్షల ఆర్థిక సహాయం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-25 10:33:26.0  )
Venu Swamy : శ్రీతేజ్ కు వేణు స్వామి రూ.2లక్షల ఆర్థిక సహాయం
X

దిశ, వెబ్ డెస్క్ : వివాదస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) తన పెద్ద మనసును చాటుకున్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre)తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయి తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sreetej) ను వేణుస్వామి పరామర్శించాడు. శ్రీతేజ్ కు ఆర్థిక సహాయం(Financial Assistance)గా అతడి తండ్రి భాస్కర్ కు రూ.2 లక్షల చెక్కును వేణు స్వామి అందించాడు.

సినీ, రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెబుతూ తరుచు వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలకు గురవుతుండే వేణుస్వామి చేసిన సహాయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సినీ ఇండస్ట్రీకి చెందిన బడా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖుల కంటే కూడా శ్రీతేజ్ వ్యవహారంలో వేణు స్వామి గొప్పగా స్పందించాడన్న టాక్ వినిపిస్తోంది.

అంతకుముందు రేవతి, శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున రూ.50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున రూ.50 లక్షలు మొత్తం రూ.2 కోట్ల పరిహారాన్ని టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు ద్వారా అల్లు అరవింద్ అందచేశారు. శ్రీతేజ్ వైద్యం కోసం సుకుమార్ భార్య తబిత రూ.5లక్షలు అందించారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ రూ.25లక్షలు సహాయం అందించారు. శ్రీతేజను నటులు జగపతిబాబు, ఆర్.నారాయణ మూర్తి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లు పరామర్శించారు.

Advertisement

Next Story

Most Viewed