- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VC Sajjanar: ఆ కాల్స్ వస్తే స్పందించొద్దు.. ప్రజలకు సజ్జనార్ కీలక సూచన
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గత కొంత కాలంగా సైబర్ మోసాలు(Cyber Frauds) పెరిగిపోతున్న విషయం తెలిసిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకొని ప్రజల నుంచి అందినకాడికి డబ్బును దోచేస్తున్నారు. కాల్స్(calls), మెస్సేజెస్(Messages), లింక్స్(Links) ఇలా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకొని కేటుగాళ్లు అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. సైబర్ మోసాలు రోజురోజుకి ఎక్కువైతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) తాజాగా కీలక సూచనలు చేశారు. కొత్త తరహా సైబర్ మోసల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు బుధవారం 'ఎక్స్(X)' వేదికగా ఓ పోస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ల నుంచి తల్లిదండ్రులకు(Parents) ఫోన్ కాల్స్ చేసి మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్(Accident)కు గురయ్యారని, హాస్పిటల్(Hospital)లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, సర్జరీ(Surgery) కోసం వెంటనే డబ్బులు పంపాలనే మాయగాళ్ల బారిన పడవద్దని, డబ్బులు పంపాలంటూ లింకులను షేర్ చేస్తున్న కేటుగాళ్ల కాల్స్/ మెసేజులుకు స్పందించవద్దన్నారు. ఆ లింకులను క్లిక్ చేయగానే బ్యాంక్ ఖాతాల(Bank Accounts) నుంచి నేరగాళ్లు నగదును గుల్ల చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తే కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోస్టులో పేర్కొన్నారు.