Revanth Reddy కొత్త పార్టీ ప్రచారంపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!

by GSrikanth |   ( Updated:2022-12-27 07:37:00.0  )
Revanth Reddy కొత్త పార్టీ ప్రచారంపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సోషల్ మీడియా ప్రచారం వివాదాస్పదం అవుతోంది. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోందని దాని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డినే అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారాన్ని అంత తేలికగా తీసుకోవొద్దని సూచించారు. మంగళవారం మాట్లాడిన వీహెచ్.. పార్టీ పెడుతున్నారన్న సోషల్ మీడియా పోస్టులను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాలని హితవు పలికారు. అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు. పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం విషయంలో దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన నివేదికతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించడంపై ఆయన స్పందిస్తూ కేసులో సిట్ ను పక్కన పెట్టారని, అన్ని సంస్థలను బీజేపీ తన సొంత అవసరాలకు వాడుకుంటోందని ధ్వజమెత్తారు.

రూట్ మార్చిన రేవంత్ రెడ్డి?:

కొత్త పార్టీ ఆరోపణల విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూట్ మార్చారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసిన శంకర్ అనే వ్యక్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్ గౌడ్ సైబర్ క్రైమ్ ఏసీపీకీ ఫిర్యాదు చేశారు. అయితే ఇదే తరహా ఆరోపణలు కొన్ని రోజులకు ముందు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి సైతం చేశారు. అయితే రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సొంత దారి చూసుకునే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలపై పెద్దగా రియాక్ట్ కానీ కాంగ్రెస్ నేతలు శంకర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే ఇంతలా రియాక్ట్ కావడానికి కూడా ఓ కారణం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. 'రేవంత్ రెడ్డి ఓ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ పేరు.. తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ' అంటూ చేసిన ట్వీట్ రేవంత్ వర్గానికి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి ప్రచారాలను ఉపేక్షించకుండా సీరియస్ గా తీసుకోవాలని అందులో భాగంగానే శంకర్ అనే వ్యక్తిపై ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్లు, జూనియర్లు అనే రచ్చ కాంగ్రెస్ లో జరుగుతుండగా తాజాగా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ అనే ఆరోపణలు టీ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అనే మరో చర్చ తెరపైకి వస్తోంది.

Also Read...

ఈడీ విచారణకు గైర్హాజరుపై Rohit Reddy క్లారిటీ

Advertisement

Next Story

Most Viewed