యూ ట్యాక్స్ దుమారం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-05-21 12:44:45.0  )
యూ ట్యాక్స్ దుమారం.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందని, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ. 100 కోట్లు పంపించాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాపై మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాననని, మహేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించామని, అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టామన్నారు. యూ ట్యాక్స్ వసూలు చేశామనడం అబద్ధం అన్నారు. ప్రస్తుతం తాను కుటుంబంతో దైవదర్శనానికి వేరే రాష్ట్రానికి వచ్చానని, రేపు సాయంత్రం హైదరాబాద్ కు వచ్చాక మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెప్తానన్నారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఆర్ఆర్ (రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ) ట్యాక్స్ మొదలైందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం విమర్శలు గుప్పించగా తాజాగా ఇప్పుడు యూ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారంటూ ఏలేటీ చేసిన ఆరోపణలు దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story