- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ జాతీయ రాజకీయం!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బులతో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం కోసమే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమంగా దోచుకున్న డబ్బులను బీఆర్ఎస్ పేరుతో దేశమంతటా రాజకీయ నాయకులకు పంచబోతున్నారని ఆరోపించారు. గురువారం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాల బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు ప్రధాని వస్తే మర్యాదపూర్వకంగా కలిసే సంస్కారం కూడా లేదని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కనీసం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వచ్చే తీరిక కూడా ఆయనకు లేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, అందరికీ దళిత బంధు అమలు చేస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ చేయని అక్రమాలు, అరాచకాలు, అవినీతి అంటూ లేదని కేసీఆర్ కుటుంబం అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందన్నారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన, నియంతృత్వ పార్టీ పోవాలని కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ద్వారా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఈ తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపై ఉందన్నారు. ఈనెల 30 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా జరిగే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడంతో పాటు వారిని సంఘటితం చేయాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా మనది కుటుంబ పార్టీ కాదని, మన పార్టీలో లిక్కర్ స్కాంలు, అవినీతి స్కాంలు లేవన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ జన సంపర్క్ అభియాన్ యాత్రను ప్రతి బీజేపీ ఉత్సాహంగా పని చేయాలన్నారు.
ప్రధాని మోడీకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని యావత్ ప్రపంచం భారత దేశ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు. కర్ణాటకలో ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చినా సీఎంను ఎంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడిందని కనీసం సీఎంను ఎంచుకోలేని కుటుంబ పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తుందా అని చురకలు అంటించారు. పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆదోళనలు, ఎన్ని బుజ్జగింపులు, జాతీయ నాయకులతో ఎన్ని చర్చలు జరిపిందో అందరం చూశామని ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు అంత కష్టమా అని సెటైర్ వేశారు. గతంలో సోనియా గాంధీ రిమోట్ ఆపరేట్ చేస్తే మన్మోహన్ సింగ్ పనిచేసేవారని విమర్శించారు.