- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ.. దానికి సహకరించాలని రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పీఎం ఆవాస్ యోజన ఫలాలు పేదలకు అందేలా చూడాలని మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. పేదల ఇళ్ల విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు. పేదలకు సొంతింటి కల సాకారమయ్యేలా చూడాలని అన్నారు. ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని కోరారు. అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యాదర్శులతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వం, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలపై చర్చించారు. కాగా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె లోక్‌సభలో మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.