- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పండి ముందు
దిశ, వెబ్‌డెస్క్: ప్రజల ఆశలు, ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వమ్ము చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంకుబండ్‌లో రూ.26 లక్షల వ్యయంతో దోబిఘాట్ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి కేంద్ర మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన చూశాక అన్ని వర్గాల ప్రజలు మోసపోయామని భావిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. యువతకు నిరుద్యోగ భృతి గురించి ఇంకా సీఎం ఆలోచించడం లేదు. రైతుబంధు ఇవ్వడం లేదు. రైతుబంధు ఉందో, లేదో తెలియదని ఎద్దేవా చేశారు.
అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి(Kishan Reddy) డిమాండ్ చేశారు. సమాజంలో చేతివృత్తులు కనుమరుగవుతున్న నేపథ్యంలో వారికి ప్రధాని మోడీ(PM Modi) ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న క్రమంలోనూ చేతివృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేటికి గ్రామాల్లో అనేక వర్గాల ప్రజలు ఒక కుటుంబంలా జీవనం కొనసాగిస్తున్నారని, చేతివృత్తులను ఆదుకోవడం కోసం ప్రధాని మోడీ ముద్ర యోజన, స్వనిధి, విశ్వకర్మ యోజన పేరుతో చేతివృత్తులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విశ్వకర్మ యోజన కింద కేంద్రప్రభుత్వం కోట్లాది మంది ప్రజలకు నైపుణ్య శిక్షణ, పరికరాలు, ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో వేలాది మందికి నైపుణ్య శిక్షణ, పరికరాలు అందించడంతోపాటు ఆర్థిక సాయం కూడా అందజేస్తామన్నారు.