- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో ఖనిజ సంపదకు లోటు లేదు: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశంలో ఖనిజ సంపదలకు ఎలాంటి లోటు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఇంతవరకు వివిధ కారణాలతో.. అనుకున్నంతగా ఆ సామర్థ్యాన్ని అందిపుచ్చుకోలేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2015లో ప్రధాని మోడీ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఈటీ)ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో సోమవారం జరిగిన 6వ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఎక్స్-అఫీషియో చైర్మన్ హోదాలో కిషన్ రెడ్డి మాట్లాడారు. భారతదేశంలో ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించి భవిష్యత్తులో మరింత సానుకూల ముందడుగు వేయబోతున్నామని స్పష్టం చేశారు. ఎన్ఎంఈటీ సంస్థ ద్వారా ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్లో ఏటేటా పురోగతి సాధిస్తున్నామన్నారు. రాష్ట్రాలు ఎన్ఎంఈటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. స్టార్టప్ లను ప్రోత్సహించడం, ప్రైవేట్ రంగానికి అవసరమైన సహకారాన్ని అందించడం వంటి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సంపూర్ణ సహకారం అందించేందుకు కృషిచేస్తామన్నారు. సహకార సమాఖ్య విధానంలో అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ఎంఈటీ ద్వారా చేపట్టిన వివిధ కార్యకలాపాలను, ప్రాజెక్టులను ఈ సందర్భంగా కేంద్రమంత్రి వివరించారు. నేషనల్ జియోసైన్స్ డేటా రిపాజిటరీ పోర్టల్ ద్వారా.. ఎక్స్‌ప్లొరేషన్ ద్వారా సాధించిన పురోగతిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ఈ రంగంలో మరింత పురోగతి సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు.. కేంద్ర అటామిక్ ఎనర్జీ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ దూబే మాట్లాడుతూ.. దేశంలో ఖనిజాల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని, పరస్పర సహకారంతో జాతి నిర్మాణానికి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ గనుల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గనుల రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. ఎన్ఎంఈటీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్(మెఈఆర్ఐటీ) ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆఫ్ షోర్ మైనింగ్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్‌ప్లొరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. కాగా, ఏపీ తరహాలోనే మిగిలిన రాష్ట్రాలు ఇలాంటి ఆలోచనలతో ఎక్స్‌ప్లొరేషన్ కు ప్రోత్సాహాన్ని అందించాలని కిషన్ రెడ్డి సూచించారు.
హర్ ఘర్ తిరంగ.. అందరి బాధ్యత
హర్ ఘర్ తిరంగా.. అందరి బాధ్యత అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ఆయన కోరారు. హర్ ఘర్ తిరంగలో భాగంగా.. హైదరాబాద్ లోని తన నివాసంపై కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగనుందని చెప్పారు.