- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల శంఖారావం పూరించిన కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాభించారు. శంఖారావం పూరించి యాత్రను షురూ చేశారు. రాష్ట్రంలో ఇవాళ మొత్తం నాలుగు క్లస్టర్లలో యాత్రలు ప్రారంభమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది.
114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు జరుగనున్నాయి. ఈ యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన ఈ యాత్రలు ముగియనున్నాయి. ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విస్తృతంగా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు.