- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'2023 లోపు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్నిరంగాల్లోనూ ప్రగతిపథంలో దూసుకెళ్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2047 నాటికి అంటే వచ్చే 25 ఏళ్ల అమృత్ కాలంలో ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పురోగతి సాధించాలని, 2047లో 'డెవలప్డ్ భారత్'లో జెండా ఎగరేసుకుందామని ఆయన అన్నారు. పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా 'రోజ్‌గార్ మేళా' ను తొలి విడతగా శనివారం దేశవ్యాప్తంగా అర్హత సాధించిన వారికి నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, బండి సంజయ్‌తో పాటుగా దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొని నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయులందరికీ సాధికారత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత సాధికారత కోసం కేంద్రం చేపట్టిన పలు పథకాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలిస్తున్నాయని, స్వయం ఉపాధి పొందడంతోపాటు, పలువురికి ఉపాధి కల్పించే దిశగా దేశ యువత వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోందన్నారు. ఆగస్టు 2023 లోపు దేశవ్యాప్తంగా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దళారీల వ్యవస్థ లేకుండా, పరిపూర్ణమైన పారదర్శకతతో పరీక్షల్లో తమ సామర్థ్యాన్ని చాటుకునే వారికే ఉద్యోగాలు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో 75 వేలకు పైగా యువతకు నియామక పత్రాల అందశామని తెలిపారు. దేశ సేవలో భాగస్వాములై నవభారత నిర్మాణానికి బాటలు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎకె గుప్తా, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.