ఎవరి మేలు కోసం ఆ నిర్ణయం తీసుకున్నావు.. కేసీఆర్‌‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

by GSrikanth |
ఎవరి మేలు కోసం ఆ నిర్ణయం తీసుకున్నావు.. కేసీఆర్‌‌కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని.. టెండర్లలో పాల్గొంటామని ఉదరగొట్టిన బీఆర్ఎస్ నేతలు ఓఆర్ఆర్‌ను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ వెనుక మతలబు ఏంటని, 30 ఏళ్ల వరకు ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఎవరి మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. ఓఆర్ఆర్ ను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ఐఆర్బీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఓఆర్ఆర్ కాంటాక్ట్ లో పెద్ద కుంభకోణం ఉందన్నారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 వరకే ఆమోదం పొంది ఉందని, దానికి మించి ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ జరపడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. క్రిసిల్ కంపెనీ ఓఆర్ఆర్ పై అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ బయట పెట్టలేదని ఆరోపించారు. నమ్మించి మోసం చేయడం.. గొంతు కోయడం లో కల్వకుంట్ల కుటుంబం ఆరితేరిందని కిషన్ రెడ్డి విమర్శించారు.ల

Advertisement

Next Story

Most Viewed