- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ కేసు.. మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.. కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీసు సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి.. కానీ, అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితది అక్రమ అరెస్ట్ అని అనడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌కు కవిత అరెస్ట్‌కు సంబంధం లేదని తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర లేదని మీడియా ముందు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవడం కాదు.. దమ్ముంటే కేసీఆర్‌ను బహిరంగ చర్చకు రమ్మనండి అని సవాల్ విసిరారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. లఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది.