చిరంజీవి నివాసానికి కేంద్రమంత్రి

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-27 05:23:02.0  )
చిరంజీవి నివాసానికి కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున, చిరంజీవిలు కేంద్ర మంత్రిని సత్కరించారు. ఈ మేరకు ఆ చిత్రాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన మెగాస్టార్ ‘హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా తమ ఇంటింకి వచ్చినందుకు థాంక్యూ డియర్ అనురాగ్ ఠాకూర్..

సోదరుడు నాగార్జునతో జరిగిన భేటీ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. భేటీ సందర్భంగా ఇండియా చలనచిత్రంలో వస్తున్న మార్పులు, మేకింగ్ గురించి చర్చించాం.’ అని కామెంట్ చేశారు. ట్విట్టర్‌లో ఈ మేరకు అనురాగ్ ఠాకూర్‌కి వినాయకుడి ప్రతిమను బహుకరిస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో హీరో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed