- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: చాంపియన్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పెషల్ విషెస్
దిశ, డైనమిక్ బ్యూరో: మీ అత్యుత్తమ ప్రదర్శన ఇండియా గర్వాన్ని పెంచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్లకు బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయన ట్వీట్ లో మనుబాకర్, సరబ్‌జోత్ సింగ్ లకు అభినందనలు అంటూ.. పారిస్ ఒలంపిక్స్ లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ల లో కాంస్య పతకాన్ని సాధించారని తెలిపారు. అలాగే మీ అత్యుత్తమ ప్రదర్శన ప్రపంచ వేదికపై ఇండియా గర్వాన్ని పెంచిందని, మీ సంకల్పం మరియు శ్రేష్ఠతతో దేశం ప్రేరణ పొందిందని, ఇక ముందు కూడా ఇలాగే మరింత ముందుకు పోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. కాగా పారిస్ ఒలంపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో ఇండియా షూటర్లు అయిన మనుబాకర్, సరబ్‌జోత్ సింగ్ జోడీ దక్షిణ కొరియాని ఓడించి కాంస్య పతకం సాధించారు. ఇందులో భారత షూటర్లు 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ప్లేయర్స్ కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించారు. ఇప్పటికే మనుబాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో పారిస్ ఒలంపిక్స్ 2024 లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది.