- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ధైర్యసాహసాలకు సెల్యూట్.. ఐటీబీపీ సిబ్బందికి మంత్రి బండి సంజయ్ ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ లాహౌల్, స్పితిలోని కాజా సమీపంలో సంభవించిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికాకు చెందిన పారాగ్లైడర్ బోక్ స్టాలర్ ట్రేవర్ మృతదేహాన్ని 14,800 అడుగుల ఎత్తులో గుర్తించి కిందకు తీసుకువచ్చిన ఐటీబీపీ దళాలను కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రశంసించారు. పారాగ్లైడింగ్ ప్రమాదంలో విషాదకరంగా మరణించిన ఒక అమెరికన్ పౌరుడి మృతదేహాన్ని క్లిష్ట పరిస్థితులను దాటుకుని తీసుకువచ్చిన మీ ధైర్య సాహసాలకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. మానవత్వం పట్ల మీ ప్రయత్నాలన్నింటినీ అభినందిస్తున్నానని ప్రశంసించారు. కాగా బోక్ స్టాలర్ ట్రేవర్ మూడు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో పారాగ్లైడింగ్ చేస్తూ అదృశ్యమయ్యాడు. అతడి కోసం నిర్వహించిన 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం 14,800 అండుగుల ఎత్తులో ప్రమాదం బారిన పడినట్లు ఐటీబీపీ సిబ్బంది గుర్తించింది. దీంతో అక్కడికి చేరుకోగా అతడు అప్పటికే ప్రణాలు కోల్పోయాడు. అక్కడి నుంచి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. అత్యంత క్లిష్టతరమైన ఈ పనిని ఐటీబీపీ ధైర్యసాహసాలతో పూర్తి చేసినందుకు పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కాగా దాదాపు 90,000 మంది సిబ్బంది కలిగిన ఐటీబీపీ ప్రధానంగా చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖను రక్షించే బాధ్యతను నిర్వహర్తిస్తుంది. అలాగే వివిధ రకాల అంతర్గత భద్రతా విధులకు సైతం చేపడుతుంది.