Friendship Day Special: చిన్ననాటి స్నేహితులతో కేంద్రమంత్రి బండి సంజయ్

by Gantepaka Srikanth |
Friendship Day Special: చిన్ననాటి స్నేహితులతో కేంద్రమంత్రి బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం తన చిన్ననాటి స్నేహితులు, సరస్వతి శిశుమందిర్ క్లాస్ మేట్లతో ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ చిన్ననాటి స్నేహితులు 35 మంది హైదరాబాద్‌కు వచ్చారు. ఎల్బీనగర్ సమీపంలో మన్సూరాబాద్‌లో బండి సంజయ్ ఉన్నారని తెలుసుకున్న వారంతా అక్కడికి వచ్చారు. అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ, పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సరదాగా గడిపారు. చిన్నప్పుడు చేసిన అల్లరి, దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ తన ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ.. ఎవరెవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవడంతోపాటు వారి కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అందరితో కలిసి ఫోటోలు దిగారు.

Advertisement

Next Story