ఒడిశా బస్సు దుర్ఘటనపై బండి సంజయ్ ఆరా

by Mahesh |
ఒడిశా బస్సు దుర్ఘటనపై బండి సంజయ్ ఆరా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒడిశా లో జరిగిన బస్సు దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఆదేశాల మేరకు ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం శనివారం ప్రమాద ఘటన, గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై మయూర్ బంజ్ జిల్లా మెజిస్ట్రేట్ తో పాటు సీడీఎంఓ, ఆసుపత్రి సూపరిండెంట్ తో పాటు మెడికల్ కాలేజీ అధికారులతో ఆరా తీసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని, మరో 14 మందికి గాయాలయ్యాయని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారి మృత దేహాలను తక్షణమే వారి స్వస్థలానికి తరలించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం కోరింది. కాగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోంశాఖ కార్యాలయం ఆదేశించింది.

Advertisement

Next Story