Bandi Sanjay: సంక్రాంతిలోపే విడుదల చేయాలి.. సర్కార్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్

by Gantepaka Srikanth |
Bandi Sanjay: సంక్రాంతిలోపే విడుదల చేయాలి.. సర్కార్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి(Sankranti) లోపు ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’(Fees Reimbursement) మెత్తాన్ని చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను బండి సంజయ్ సన్మానించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం వల్లే ఈరోజు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉంది. అయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి నాలుగేళ్లు అయినా.. వాటిని భర్తీ చేయలేదని అన్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది. 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి.. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు.

Advertisement

Next Story