నేడు తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

by GSrikanth |   ( Updated:2023-03-11 01:46:51.0  )
నేడు తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి తెలంగాణకు వస్తున్నారు. శనివారం రాత్రి 8:25 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. ఆదివారం ఉదయం అధికారిక కార్యక్రమమైన సీఐఎస్ఎఫ్ రైసింగ్ డేకు ఆయన హాజరుకానున్నారు. కాగా శనివారం రాత్రే ఆయన బీజేపీ ముఖ్య నేతలతో భేటీ నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.

వాస్తవానికి ఈ పర్యటనలో ఆయన మేధావులతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. అయితే ముఖ్య నేతల భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం ఉదయం సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ అనంతరం మధ్యామ్నం సమయానికి ఆయన కొచ్చికి వెళ్లనున్నారు.

Advertisement

Next Story

Most Viewed