Union Budget : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ప్రవేశపెట్టే ఆరు బిల్లులివే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-22 14:52:22.0  )
Union Budget : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ప్రవేశపెట్టే ఆరు బిల్లులివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి వచ్చే నెల 12 వరకు జరగనున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశపెట్టనుంది. రేపు(మంగళవారం) బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదిలో మిగిలిన 8 నెలలకు బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సమావేశాల్లో 6 బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది. నీట్ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, అగ్నీవీర్ స్కీం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపూర్ శాంతి భద్రతలు, కావడి యాత్ర వివాదాలపై కేంద్రాన్ని ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి.90 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్-2024 బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు ఫైనాన్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి), విపత్తు నిర్వహణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, రబ్బర్ (ప్రోత్సాహం, అభివృద్ధి)తో కలిపి మొత్తం ఆరు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

Read More..

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇదే..!

Advertisement

Next Story

Most Viewed