Union Budget 2024 : కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

by Rajesh |   ( Updated:2024-07-23 04:18:34.0  )
Union Budget 2024 : కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు పార్లమెంట్‌‌లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. బడ్జెట్ ప్రతులు రాష్ట్రపతికి అందించి అనుమతిని తీసుకోనున్నారు. అనంతం కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్‌కి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. అయితే ఈ బడ్జెట్‌లో ఏపీ, బీహార్, ఒడిశాకి కేటాయింపులపై ఉత్కంఠ నెలకొంది. బీహార్, ఒడిశాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న ఏపీలోని కూటమి సర్కారు కోరుతుంది. అయితే ఇప్పటికే పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్ ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ఈ బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈలకు చేయూత ఇచ్చేలా నిర్ణయాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ పేయర్లు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తారని అంచనాలు ఉన్నాయి.

Read More : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ‘జీరో’ నిధులు.. KTR ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story

Most Viewed