Union Budget-2024: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

by Shiva |   ( Updated:2024-07-23 10:09:38.0  )
Union Budget-2024: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, ఆర్థిక రంగ నిపుణులు బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా సమతూల్యంగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. దేశంలోని నిరుపేదలను మరింత శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉందన్నారు. అన్నదాత ఉత్పాదకత సామర్థ్యాలు పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 4 కోట్ల యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని తెలిపారు.

Advertisement

Next Story